
Trolls on Jagan : ఏపీ సీఎం జగన్ కు మరో ఏడాది ఎన్నికల సమరం ఉంది. ఈ సారి ఆయనకు రాష్ర్టంలో ఫైట్ కొంత కష్టంగానే కనిపిస్తున్నది. మరోవైపు ఆయనపై ఉన్న కేసులు, ఆయన పార్టీ కీలక నేతలపై నడుస్తున్న కేసులు వేధిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. కేసులు నుంచి తప్పించుకోవడం ఎక్కువ రోజులు కుదరదని అందరికీ తెలుసు. కానీ కేంద్రంతో సఖ్యతతో ఉంటే కొన్ని రోజులు ఎలాంటి రంది లేకుండా ఉండవచ్చనేది పలువురు రాజకీయ నాయకుల తీరు..
అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ చేసిన ఒక ట్వీట్ రచ్చకు దారితీసింది. త్వరలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఢిల్లీలో ఉంది. దీనికి 19 విపక్ష పార్టీలు బాయ్ కాట్ చేశాయి. అయితే జగన్ ఈ కార్యక్రమానికి వైసీపీ తప్పకుండా హాజరవుతుందని, ఇదో మహత్తర కార్యక్రమమని స్పష్టం చేశాడు. ఇదే ఇతర పార్టీల నాయకుల ఆగ్రహానికి కారణమైంది. కేసుల నుంచి తప్పించుకోవడానికే మోదీ కాళ్ల మీద పడుతున్నాడని సెటైర్లు విసురుతున్నారు. అయితే జగన్ తమ పార్టీ వరకు చెప్పుకొని వదిలేస్తే బాగుండేది. ఇంత మంచి కార్యక్రమాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు అని అన్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు హాజరవ్వాలని సుద్దులు చెప్పాడు. ఇదే ఇతర పార్టీల నేతల కోపానికి కారణమైంది.
కేసుల కోసం బీజేపీ నేతల చుట్టూ తిరిగే పరిస్థితి మాకు లేదని, తాను హాజరు కావాలంటే హాజరు కావచ్చని కాని ఇతరులకు నీతులు చెప్పడమేంటని మండిపడుతున్నారు. రాజకీయాల్లో అసలు వ్యక్తిత్వం లేని వ్యక్తి కూడా మాటలు చెబితే నవ్వి పోదురు గాక నాకేంటి అన్నట్లు ఉంటదని సెటైర్లు విసురుతున్నారు. ఏదేమైనా వైసీపీ అధినేత ముందు తన పార్టీ సంగతి చూసుకోక ఇతరులకు నీతులు చెప్పడంపై మండిపడుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అంశం ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో బీజేపీ అగ్రనేతలను మచ్చిక చేసుకోవడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరి సీఎం జగన్ దీనిని ఎలా తీసుకుంటారో.. చూడాలి.