27.1 C
India
Wednesday, May 21, 2025
More

    Trump : ట్రంప్ ఉక్కుపాదం.. లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

    Date:

    Trump
    Trump

    Donald Trump : రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా గడువు ముగిసాక కూడా అమెరికాలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

    దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే వారి పిల్లలు డిపెండెంట్ వీసా-హెచ్4 కింద అమెరికాకు వెళ్లొచ్చు. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ వీసా పని చేస్తుంది. ఆ తర్వాత రెండేళ్లు సమయం ఇస్తారు. ఆలోపు కొత్త వీసా తీసుకోవాలి.

    డిపెండెంట్ వీసాపై వెళ్లిన లక్షా 34 వేల మంది భారతీయుల వీసా గడువు ముగింపు దశకు వచ్చినట్లు అమెరికా వర్గాలు చెప్తున్నాయి. వీసా గడువు ముగుస్తున్న వారికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ట్రంప్ చెప్తున్నట్లు అమెరికాను వీడి వెళ్లక తప్పదా అన్న ఆందోళన నెలకొంది.

    వీసా గడువు ముగిసే వాళ్లు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా ఎఫ్-1కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాని ఇది తీసుకోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు అవుతారు.

    దీని వల్ల భవిష్యత్తులో స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతారు. దీంతో వారంతా ఈ స్టూడెంట్ వీసా తీసుకోలేక.. గడువు ముగిశాకా ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Influencer : ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపాడు

    Influencer : కొలంబియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా జోస్(22)ను ఓ ఆగంతకుడు...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...