![TS Agricultural Officer](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/IMG_20240217_161913.jpg)
TS Agricultural Officer Results : తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీబీపీవో), డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపిక వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఈ నేపథ్యంలో వివాదాలు లేని రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన తుది కీని ఇటీవల విడుదల చేసింది. మెరిట్ ప్రకారం జనరల్ ర్యాంకింగ్ జాబితాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc. gov.in/ సంప్రదించగలరు.