టర్కీ , సిరియా లలో భూకంపం విలయాన్ని సృష్టించింది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో అపార్ట్ మెంట్లు , భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి దాంతో శిధిలాల కింద పెద్ద ఎత్తున చిక్కుకుపోయారు ప్రజలు. శిథిలాలను తొలగిస్తుంటే శవాల గుట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికి 4 వేలకు పైగా మరణించినట్లు భావిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగేలా కనబడుతోంది. మూడు రోజుల కిందటే భూకంపం వస్తుందని హెచ్చరికలు జారీ అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇంతటి విలయానికి కారణమని భావిస్తున్నారు. టర్కీ ని ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. భారత్ కూడా 150 మందితో కూడిన NDRF సిబ్బందిని , అవసరమైన సామాగ్రిని పంపించింది.
Breaking News