TV-9’s Ravi Prakash :
పవన్ కళ్యాణ్ కు బహిరంగ సమావేశాలు కలిసిరావేమో. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సమావేశంలో ‘తాను డిగ్రీ చదవకున్నా గానీ రోజుకు 8 గంటల వరకు చదువుతాను’ అన్నాడు. దీంతో ఆయన మాటలు విపరీతమైన ట్రోల్ కు గురవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్ లో ట్రోల్ కు గురవుతున్న మాటలు పవన్ కళ్యాణ్ వే అంటే సందేహం లేదు. ఇటీవల ఆయన వలంటీర్ల పై చేసిన కామెట్ల కైతే ఏపీ మొత్తం అట్టుడుకుతుంది. ఆ తర్వాత రోజా కూతురిపై చేసిన కామెంట్లపై కూడా ప్రతీ వర్గం ఆగ్రహంగా ఉంది. ఆయన పుస్తకాలు చదువుతాం అంటున్న దాని గురించి కూడా ట్రోల్స్ మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్ ఏం చదివారు? ఆయన చదువు గురించి టీవీ-9 రవిప్రకాశ్ తన షోలో జనసేన నాయకుడిని ప్రశ్నించారు. ఆయన చెప్పిన సమాధానం విని రజనీకాంత్ నవ్వు ఆపుకోలేకపోయారు. కానీ నవ్వితే బాగుండదని లోలోపల నవ్వుకున్నారు. ఈ విషయం మనకు స్పష్టంగానే కనిపించినా దీన్ని కొందరు వైరల్ రాయుళ్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ‘బ్రిటీష్ ఎంపైర్ ను గడ గడ లాండించిన అల్లూరి సీతారామరాజు 24 సంవత్సరాల వయస్సులోనే స్వతంత్ర పోరాటం చేశాడు. అతను కూడా చదువుకోలేదు పవన్ కళ్యాణ్ లాగ. అతను (సీతారామరాజు) ఇంటర్ వరకు 8వ తరగతి వరకు చదువుకున్నాడు.’ అన్నాడు.
దీన్ని విన్న రవి ప్రకాశ్ లోలోపల నవ్వుకున్నాడు. ఇక వైరల్ రాయుళ్లు మాత్రం జనసేన నేత మాట్లాడిన మాటలు, అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం కామెడీకి లింగ్ చేసి ఒక వీడియో చేశారు. దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేయడంతో విపరీతమైన లైకులు రావడం మొదలయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ చదువు గురించి ఆ పార్టీ నేతలకు కూడా తెలియదని కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో తెగ ట్రోలింగ్ అవుతున్నారు.
https://twitter.com/radhachakram/status/1679892507197575168?s=20






