Chai Business :
సాధించాలనే తపన, కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధిచవచ్చనే సత్యాన్ని ఇద్దరు ఫ్రెండ్స్ నిరూపించారు. ఆర్థిక నగరం ముంబైలో చిన్న చాయ్ కొట్టు పెట్టుకున్న ఇద్దరు రూ. 70 లక్షల విలువైన ఆడి కారును కొని మరీ దాన్ని కూడా బిజినెస్ పర్పస్ లో ఉపయోగించుకుంటున్నారు. వీరి హిస్టరీ ఇన్సిపిరేషన్ కలిగిస్తుంది. చదవుకున్నా అందుకు తగ్గ ఉద్యోగం లేకపోవడంతో కుంగిపోకుండా సొంతంగా ఒక బిజినెస్ ప్రారంభించారు. ఇందులో వారికి బాగానే కలిసి వస్తుంది.
పంజాబ్ కు చెందిన అమిత్, హర్యానాకు చెందిన మనుశర్మ ఇద్దరు ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి ఒక బిజినెస్ పెట్టాలని అనుకున్నారు. చాయ్ బాగుంటుందని అనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించవచ్చని వెంటనే రంగంలోకి దిగారు. ఇతని చాయ్ తాగేందుకు ప్రముఖులు వస్తుంటారు. ఈయనకు ముంబైలో ‘ఆడి చాయ్ వాలా’ అని గుర్తింపు కూడా ఉంది. డబ్బు సంపాదించడం ఎంత తేలికో ఆయన ఒక వీడియోలో మనకు చూపించారు.
అమిత్ ఫార్మసిస్ట్ కంప్లీట్ చేశాడు. సినిమాల్లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు. అందుకే కొంచెం ట్రెండింగ్ గా కనిపించాలని ట్రై చేస్తున్నాడట. ఇక ఆయన చాయ్ ను తాగేందుకు కొందరు సినీ ప్రముఖులు కూడా వస్తుంటారట. ఎంత సంపాదిస్తావు అని క్వశ్చన్ వేసినప్పుడు. ఆశ్చర్య కరమైన ఫిగర్ చెప్పాడు. ఒక కప్పు టీకి రూ. 20 తీసుకుంటున్నాడట. రోజుకు సుమారు 600 కప్పుల చాయ్ అమ్ముతాడట. ఈ లెక్కన రోజుకు రూ. 12000, నెలకు రూ. 3,60,000 సంపాదిస్తాడు. ఆడి కారు ధర రూ. 70 లక్షల అంటే దాదాపు 20 నెలల్లో ఆడి కారు కొనేంత సంపాదన ఉంటుందన్న మాట. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వాలపై ఆధారపడేకంటే ఇలాంటి బిజినెస్ తో బాగా సంపాదించవచ్చు.