Tollywood Drugs Case : ఇటీవలే డ్రగ్స్ ను సరఫరా చేస్తూ కబాలి నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ ఇటు సినీ వర్గంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపింది. అయితే ఈయన అరెస్ట్ అయిన పెద్దగా ఏ చలనం రాలేదు.. కానీ ఇప్పుడు రెండు రోజుల పోలీసుల విచారణ అనంతరం కేపీ చౌదరి పెద్ద గుట్టునే రట్టు చేసినట్టు పోలీసులు ఈసారి డ్రగ్స్ కేసు తీగ మొత్తం లాగుతున్నట్టు అనిపిస్తుంది.
ఎప్పటిలా కాకుండా ఈసారి ఏ చిన్న క్లూ వదలకుండా పోలీసుల విచారణ సాగుతుంది. అయితే కేపీ చౌదరి విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తుంది. కానీ తాజాగా కేపీ చౌదరి చెప్పిన కొద్దీ సమాచారంలో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నట్టు బయట పడింది. ఈ ఇద్దరిలో బిగ్ బాస్ లో పాల్గొన్న ఒక హీరోయిన్ తో పాటు.. తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ ఉన్నట్టు చెబుతున్నారు.
కేపీ చౌదరి ఈ ఇద్దరితో గంటల తరబడి మాట్లాడినట్టు కొన్ని వందల కాల్స్ వీరి మధ్య నడిచినట్టు గుర్తించారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనే విషయం పోలీసులు ఇంకా బయట పెట్టడం లేదు.. నిజంగానే ఈ ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనే దానిపై పోలీసుల విచారణ సాగుతుంది. నిజంగానే డ్రగ్స్ తో సంబంధం ఉంది అని తెలిస్తే వీరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి డ్రగ్స్ కేసు ఈసారి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో.






