
UBlood క్యాంపెయిన్ బసవతారకం ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగింది. రక్తదానం గురించి దాని విశిష్టత గురించి తెలియజెప్పే అద్భుత యాప్ యుబ్లడ్ యాప్. రక్తకొరత కారణంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు అనే గొప్ప ఆలోచన లోంచి పుట్టింది ఈ UBlood app. జై యలమంచిలి ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ మహత్కార్యానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు ప్రముఖ నటులు సోనూ సూద్.
UBlood ఓ మంచి కోసం తలపెట్టిన మహత్కార్యమని , అందుకు పూనుకున్న సృష్టికర్త డాక్టర్ జై యలమంచిలిని తప్పకుండా అభినందించాలని అలాగే ublood app కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సోనూ సూద్ పై కూడా ప్రశంసలు కురిపించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వసుంధర , డాక్టర్ దిలీప్ కె గుడిపూడి. ఇలాంటి గొప్ప పనులకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే యు బ్లడ్ యాప్ ను తప్పనిసరిగా అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.