
UBlood App సర్వరోగ నివారిణి లాంటిదని , అలాంటి గొప్ప యాప్ ను సృష్టించిన డాక్టర్ జై యలమంచిలిపై ప్రశంసల వర్షం కురిపించారు వరంగల్ వాసులు. హన్మకొండ లోని హరిత హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలంతా UBlood app గురించి దాన్ని ప్రతీ ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి వక్కాణించారు. రక్తదాతల వివరాలతో పాటుగా రక్తగ్రహీతల వివరాలు కూడా సంపూర్ణంగా ఉన్న యాప్ కావడంతో దాని విశిష్టత గురించి తెలుసుకొని డాక్టర్ జై యలమంచిలిని అభినందనలతో ముంచెత్తారు.
ఇక ఇదే హోటల్ లో ……..
స్టడీ మెట్రో ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమం హన్మకొండలోని హోటల్ హరిత కాకతీయలో జరిగింది. ఈ వేడుకకు కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వి. గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టడీ మెట్రో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా 36 దేశాలలో అత్యున్నత స్థాయి విద్య కోసం స్టూడెంట్స్ ను పంపిస్తోందని , ఏ ఏ దేశాలలో ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసిస్తే మెరుగైన భవిష్యత్ ఉంటుందో చక్కగా తర్ఫీదును ఇస్తోందని కొనియాడారు.
అయితే కొంతమంది స్టూడెంట్స్ ఈ విషయాలు తెలుసుకోకుండా వివిధ దేశాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారని , అలా వెళ్లేకంటే స్టడీ మెట్రో ద్వారా వెళ్లడం వల్ల ఆయా స్టూడెంట్స్ కు తగిన దేశాన్ని ఎంపిక చేసి మంచి భవిష్యత్ ను అందిస్తుందని దీన్ని స్టూడెంట్స్ తో పాటుగా పేరెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టడీ మెట్రో CEO అభినవ్ బజాజ్, వైఎస్ ప్రెసిడెంట్ కనుకుంట్ల శ్రవణ్ కుమార్ , వరంగల్ బ్రాంచ్ డైరెక్టర్ లయన్ మహేష్ కుమార్ , డాక్టర్ ఆడెపు రవీందర్ , నరేందర్ , వేణుగోపాల్ రెడ్డి , జావేద్ , పవన్ , శ్రీనాథ్ , సంఘమిత్ర , సాధన , శృతి , తదితరులతో పాటుగా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ , పేరెంట్స్ హాజరయ్యారు.