హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో అరోరా డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో UBlood app క్యాంపెయిన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొనడం విశేషం. UBlood సర్వరోగ నివారిణి లాంటి దివ్య ఔషధమని , అలాంటి గొప్ప యాప్ ను సృష్టించిన డాక్టర్ జై యలమంచిలిని అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సోనూ సూద్ ను ప్రశంసలతో ముంచెత్తారు కళాశాల స్టూడెంట్స్. అంతేకాదు తమ సెల్ ఫోన్ లలో ublood app ను డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా మరికొంతమంది చేత కూడా ఈ యాప్ ను.డౌన్ లోడ్ చేసుకునేలా చేస్తామని ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ తో పాటుగా కళాశాల యాజమాన్యం , బోధనా సిబ్బంది, UBlood app ప్రతినిధి బృందం పాల్గొన్నారు.
Breaking News