Sonu Sood Birthday Celebrations : ప్రముఖ నటుడు, ప్రజా సేవకుడు సోనూ సూద్ జన్మదిన వేడుకలు మొన్న జూలై 30న ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు, ఆయన సేవలు పొందిన వారు, సేవా గుణం ఉన్న ప్రతీ ఒక్కరూ సోనూ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షాలు చెప్పేవారితో సోషల్ మీడియా షేక్ అయ్యిందనే చెప్పాలి. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, స్టేటస్…ఇలా ‘రియల్ ’హీరో సోనూ సూద్ దేశవ్యాప్తంగా గ్రీటింగ్స్ వెల్లువలా వచ్చాయి. మీడియాలో ఆయన గురించి వేలాది కథనాలు వెలువడ్డాయి.
సోనూ సూద్ బర్త్ డే సందర్భంగా ప్రముఖ ప్రవాసాంధ్రులు, యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీశ్ బాబు యలమంచిలి ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోనూ బర్త్ డే పార్టీ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు డాక్టర్ జై. సోనూ సూద్ కు బొకే అందించి హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి డాక్టర్ జైకి థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు.
కాగా, సోనూ సూద్ యాబ్లడ్ యాప్ కు అంబాసిడర్ ఉన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి డాక్టర్ జై, సోనూ సూద్ మిత్రులుగా మారారు. డాక్టర్ జై తలపెట్టే కార్యక్రమాల్లో సోనూ హాజరవుతుంటారు. అలాగే భారత్ కు డాక్టర్ జై వచ్చారంటే సోనూను కలుస్తుంటారు. ఇలా ఇద్దరు ప్రజా సేవకులు పరస్పరం ప్రజల గురించి కలుస్తూ చర్చించుకోవడం గమనార్హం. సోనూ ఇచ్చిన స్ఫూర్తితో ‘యూబ్లడ్’ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు డాక్టర్ జై యలమంచిలి గారు.
సోనూ సూద్ బర్త్ డే సందర్భంగా యూబ్లడ్ ఫౌండర్ డా. జై జగదీశ్ బాబు యలమంచిలి గారు మాట్లాడుతూ..ప్రజా సేవ రంగంలో సోనూ సూద్ మరిన్ని కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుకున్నారు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సోనూ సూద్ స్ఫూర్తితో అభాగ్యులకు, బాధితులకు అండగా సెలబ్రిటీలు ముందుకురావాలని ఆయన కోరారు. సోనూ సూద్ స్ఫూర్తితో తమ ‘యూబ్లడ్’ సేవలను మరింత విస్తరించనున్నామని, తమ సేవ కార్యక్రమాలను ప్రజల కోసం కొనసాగించడంలో ఏమాత్రం వెనుకాడబోమని డాక్టర్ జై గారు చెప్పారు.