32.4 C
India
Wednesday, April 24, 2024
More

    NTR Jayanthi : యుగపురుషుడు ఎన్టీఆర్ కు U BLOOD Founder , జైస్వరాజ్య టీవీ చైర్మన్ డా.‘జై యలిమంచిలి’ ఘననివాళి

    Date:

    NTR Jayanthi – Dr. Jai Yalamanchili : తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఘనంగా జరుగుతోంది. ఆ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు మనవడు జూ.ఎన్టీఆర్, రామకృష్ణ, నటుడు రాజేంద్రప్రసాద్ సైతం నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

    నటసార్వభౌముడు, యుగ పురుషుడు, కారణ జన్ముడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావుకు యూ బ్లడ్ ఫౌండర్, జై స్వరాజ్య్ టీవీ చైర్మన్   డాక్టర్ జై యలమంచిలి ఘన నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా జై స్వరాజ్య్ టీవీ చైర్మన్ డా. జై యలమంచిలి మాట్లాడుతూ నందమూరి తారకరామారావు రాష్ర్టానికి, పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఢిల్లీ పాలకుల పెత్తనాన్ని తొలిసారిగా ఎదుర్కొని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, ఆయన మరణించి పాతికేళ్లయినా ఇప్పటికీ ఆయన సేవలను సదా స్మరించుకోవడం ఇది తెలియజేస్తున్నదన్నారు.

    మొట్టమొదటిసారిగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని, ఇదే ఆయనను అగ్రపథాన నిలిపిందన్నారు. దీంతో పాటు రాజమండ్రిలో శత జయంత్యుత్సవాల సందర్భంగా జరుగుతున్న మహానాడుకు తన అనుయాయులతో కలిసి భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు. మహానాడు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, తెలుగు జాతి ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

     

    Share post:

    More like this
    Related

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ కు..  గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు నేడు

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య...

    Priyanka Gandhi : మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది: ప్రియాంక గాంధీ

    Priyanka Gandhi : మంగళసూత్రం విలువ తెలియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

    Anacondas : వామ్మో అనకొండలు.. ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్

    Anacondas : ఇండియాలో కూడా అనకొండలను పెంచుకోవడం ట్రెండ్ గా మారినట్లు...

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Dr. Jai Sir Birthday : వరంగల్ వృద్ధాశ్రమంలో ఘనంగా డా.జై గారి బర్త్ డే

    Dr. Jai Sir Birthday : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...