
Uday Kiran life : ఉదయ్ కిరణ్.. ఈయన మరణించి చాలా ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఈయనకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.. టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకుని వరుస ప్రేమ కథలతో మెప్పించారు ఉదయ్ కిరణ్.. ఈయన చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు.
అప్పట్లో ప్రేమ కథలకు పెట్టింది పేరు.. అంతగా ఈయన ఒకేసారి ఆకాశానికి ఎదిగాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.. మరి ఈయన మరణించి 8 ఏళ్ళు అవుతున్న కూడా ఇప్పటికీ ఈయన గురించి చర్చకు వస్తూనే ఉంది.
అయితే ఈయన కెరీర్ ముగిసి పోవడానికి స్టార్ హీరో నుండి జీరోకు పడిపోవడానికి కారణం చిరంజీవి అని చాలా మంది అంటూ ఉంటారు.. ఈ విషయంపై మెగాస్టార్ ను దగ్గర నుండి గమనించిన జర్నలిస్ట్ మాట్లాడారు. ఆయనకు ఆఫర్స్ లేకపోవడం వల్లనే కెరీర్ డౌన్ అయ్యింది కానీ దాని వెనుక చిరంజీవి లేరు అని అసలు వేరే వాళ్ళ ఆఫర్స్ ను చిరు ఎందుకు అడ్డుకుంటారు? అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
చిరంజీవి ఒక తండ్రిలా అలోచించి తన కూతురు జీవితాంతం బాగా చూసుకునే వ్యక్తితో పెళ్లి చేయాలనీ అనుకున్నారు.. ఉదయ్ కిరణ్ కుటుంబం, ఆయన స్థానం సరిపోక పోవడం వల్లనే చిరంజీవి ఉదయ్ తో పెళ్ళికి ఒప్పుకోలేదని.. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ఆయనను తండ్రిగా భావించే పవన్ కోపంగా ఉదయ్ ను చంపేస్తానని బెదిరింపులు పంపి ఉండవచ్చు.. ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిని నిందించడం సరైనది కాదు అని ఆ జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు..






