
బుల్లితెర యాంకర్ల జాబితాలో గుర్తింపు పొందిన వారిలో ఉధయ భాను ఒకరు. ఝాన్సీ, సుమతో పాటు చాలా కాలం కలిసి పని చేసినా అనతి కాలంలోనే బుల్లితెర నుంచి బయకు వెళ్లారు ఉదయభాను, ఝాన్సీ. కానీ సుమ మాత్రం ఇప్పటి స్టా్ర్ యాంకర్ గానే కొనసాగుతున్నారు.
తెలంగాణ యాస, భాషతో ఎక్కువ మందిని ఆకట్టుకున్నారు ఉదయ భాను. పల్లె జానపదాలతో కూడిన షోకు ఆమె హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత వచ్చిన చాలా మంది యాంకర్లు ఆమెను ఫాలో అయ్యారంటే ఆమె బుల్లితెరపై వేసిన గుర్తులు ఇప్పటికీ ఉన్నయని అనిపిస్తుంది. దీంతో పాటు వెండితెరపై కూడా ఆమె అలరించారు. ఆమె హోం టూర్ కు సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె ఇంటిని మనం కూడా ఒకసారి చూద్దాం రండి.
యాంకర్లలో ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునే ఈ ఆరడుగుల భామ. సినిమాల్లో ఐటం సాంగ్ లలో కూడా చేసింది. కెరీర్ పీక్ లో ఉండగానే విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది ఉదయ భాను. ఈ విషయంలోనే తన తల్లితో గొడవకు దిగింది ఉదయ భాను. విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. ఆమెకు కవల కుమార్తెలు పుట్టారు.
ఉదయ భాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఇటీవల తన సొంతింటిలోకి వెళ్లిన ఆమె హోం టూర్ వీడియోను తన ఛానల్ లో పోస్ట్ చేసింది. విశాల వంతమైన భవంతికి సంబంధించి రిచ్ గా ఉన్న ఈ వీడియోను నెటిజన్లు బాగా వైరల్ చేస్తున్నారు. భారీ వ్యూవ్స్ తో కొనసాగుతోంది. ఆమె ఇంటిని చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.






