IVF DNA Test : తల్లిదండ్రులు కావడం ప్రతీ జంట జీవితంలో అత్యంత ఆనందకరమైన జీవితం. ఒక సినిమాలో వెంకటేశ్ చెప్పినట్లు ఆడది సంపూర్ణమైన ఆడదిగా మారాలంటే పిల్లలు కంటేనే మారుతుందని. ఈ విషయాన్ని పెద్దలు కూడా చెప్తుంటారు. పుట్టిన పిల్లలను దంపతులు అపురూపంగా చూసుకుంటారు. పెద్ద జీవితంలో సంతోషాన్ని తీసుకచ్చేది చిన్నారులు మాత్రమే. అయితే ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కన్న ఒక అమెరికన్ దంపతులకు ఈ సంతోషం దుఃఖంగా మారింది. ఎందుకంటే వీరికి పుట్టిన అబ్బాయికి బయోలాజికల్ తండ్రి ఎవరో తెలియని పరిస్థితి ఎదురైంది.
అమెరికా, ఉటా స్టేట్, సాల్ట్ లేక్ సిటీకి చెందిన వానర్, డోనా జాన్సన్ దంపతులు కొన్నేళ్లు కాపురంలో ఒకబిడ్డ పుట్టింది. మళ్లీ పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. దీంతో ఐవీఎఫ్ ద్వారా పిల్లలకు జన్మనివ్వాలని అనుకున్నారు. 2007లో వీరు అనుకున్నది ఫలించింది. వారికి ఒక కుమారుడు జన్మించాడు. పదేళ్ల తర్వాత వానర్, డోనా డీఎన్ఏ టెస్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ టెస్ట్ రిజల్ట్ షాక్‌కు గురి చేసింది.
తల్లిదండ్రులు షాక్
డీఎన్ఏ రిజల్ట్స్ చూసి జాన్సన్ దంపతులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. చిన్న కుమారుడికి తండ్రి ‘అన్ నోన్’ అని ఫలితం చూపించింది. ఇద్దరు పిల్లలకు తల్లి ఒకరే అని తేలింది. కానీ చిన్న కొడుకు బయోలాజికల్ ఫాదర్ మాత్రం ప్రస్తుత తండ్రి కాదని ఫలితాల్లో బయటపడింది.
మళ్లీ టెస్ట్..
మరింత అనుమానం వచ్చిన జాన్సన్ దంపతులు మరోసారి డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు. ఈసారి కూడా అవే ఫలితాలు వచ్చాయి. రెండో కుమారుడికి వానర్ బయోలాజికల్ ఫాదర్ కాదని తేలింది. ఐవీఎఫ్ సమయంలో మరొక వ్యక్తి శుక్రకణాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వానర్ బాధ పడ్డాడు. ‘మేము ఎన్నో ఎమోషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మా కుమారుడి విషయంలో మాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. కానీ ఈ సమస్యను సపరేట్‌గా డీల్ చేయాల్సి వచ్చింది.’ అని జాన్సన్ చెప్పాడు.
పిల్లాడి రియాక్షన్
రెండో కుమారుడికి ఈ విషయం చెప్పేందుకు జాన్సన్ దంపతులు ఏడాది పాటు ఎదురుచూశారు. ఆ తర్వాత విషయం తెలిసినప్పటికీ, రెండో కుమారుడు బాధపడలేదు. వాస్తవాన్ని అంగీకరించాడు. వానర్ కాస్త రిసెర్చ్ చేసిన తర్వాత, తన రెండో కుమారుడి బయోలాజికల్ ఫాదర్ డెవిన్ అనే వ్యక్తి అని తెలుసుకున్నాడు.