Nihaarika నాగబాబు కూతురిగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ నిహారిక అందరికీ తెలుసు.. మంచి నటనతో పేరు సంపాదించుకున్నది కూడా. అయితే కొంతకాలంగా ఆమె వైవాహిక జీవితం పై వదంతులు వస్తున్నాయి. ఆమె విడాకుల తీసుకుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈనెల 4న ఆమె అధికారికంగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది.
నిహారిక భర్త పేరు జొన్నలగడ్డ చైతన్య. మామ రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు. నిహారిక వివాహం అత్యంత గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అత్యంత గ్రాండ్ గా నిర్వహించారు. అయితే మొదట ఈ జంట అన్యోన్యంగానే ఉంది.
సోషల్ మీడియాలో వీరి పోస్టులను చూసిన వారంతా ఎంతో మెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ఫొటోలను నిహారిక సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో అందరికీ అనుమానం మొదలైంది. ఇందుకు ఊతమిస్తూ చైతన్య కూడా ఇటీవల మెగా ఫంక్షన్లకు హాజరవలేదు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్, రాంచరణ్, ఉపాసనల బేబీ ఫంక్షన్ కుచైతన్య హాజరవలేదు. దీంతో ఇక విడాకులు ఖాయమయ్యాయని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ జంట అధికారికంగా ప్రకటించింది.
ఇద్దరం స్నేహపూర్వక వాతావరణంలోనే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా నిహారిక మామ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిహారికకు పెద్దలంటే గౌరవం లేదని, భర్తపై ప్రేమ కూడా లేదని సన్నిహితులతో ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఎప్పుడు క్లబ్బులు, పబ్బులు అంటూ తిరిగేదని చెప్పుకొచ్చారు. తాను రిటైర్డ్ ఐజీగా మంచి హోదాలో పనిచేశానని మా కుటుంబం గౌరవం పోయేలా ప్రవర్తించిందని తెలిపారు.
అయితే తన కొడుకును బద్నాం చేస్తూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని అందుకే తాను స్పందించినట్లు చెప్పారు. కొంత సంయమనం పాటించేలా ఆ ఇంటి పెద్దలే చూసుకోవాలని, కానీ అలా జరగడం లేదని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ప్రభాకర్రావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సినీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో వివాహం చేసుకున్న నిహారిక ఇలా ప్రవర్తించిందా అంటూ అంతా ట్రోల్స్ చేస్తున్నారు. మరి నిహారిక మామ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.