24.9 C
India
Friday, March 1, 2024
More

    Ayushman Bharat Scheme : పేదల వైద్యం కోసం కేంద్ర సర్కారు రూ.10 లక్షల సాయం

    Date:

    Ayushman Bharat Scheme
    Ayushman Bharat Scheme

    Ayushman Bharat Scheme : కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. వాటిని మన రాష్ట్రంలో అమలు కాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారు. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రమే డబ్బులు ఇస్తుంది. కానీ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా నిరోధించింది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 5 లక్షలు అందిస్తోంది. దీన్ని రూ. 10 లక్షలకు పెంచే యోచనలో పడింది.

    దేశంలోని పేద ప్రజల ఆరోగ్య రీత్యా ఉచిత వైద్యం అందించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీని గురించి వివరంగా ప్రస్తావించనుంది. ఆయుష్మాన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దేశంలోని గరీబు కుటుంబాలకు ఆసరా నిలిచేందుకు ఉద్దేశించిన ఆయుష్మాన్ పథకం గురించి అందరు అవగాహనతో దరఖాస్తు చేసుకుంటే మంచిది.

    ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు చేర్చాలని చూస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 10 లక్షలకు కవరేజ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2024-25 సంవత్సరానికి ఆయుష్మాన్ కవరేజీ పెంపు వర్తించేలా ప్రణాళికలు వేస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే పీఎంజేఏవై అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కొత్తగా రిజిస్ట్రేషన్ ట్యాగ్ పై క్లిక్ చేయాలి. తరువాత పేరు, జెండర్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు ఎంటర్ చేయాలి. తరువాత క్రాస్ చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి దరఖాస్తు ఫారమ్ మరోసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. దీంతో అధికారులు పరిశీలించి ఆరోగ్య కార్డును జారీ చేస్తారు.

    Share post:

    More like this
    Related

    JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

    JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

    Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

    Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

    Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

    Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related