21.4 C
India
Sunday, January 18, 2026
More

    Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఊహించని పదవులు..

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేయడంతో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం కేంద్రంలో నరేంద్రమోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు దాదాపు 30మందికి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక మిగిలింది ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం కోసం కేసరపల్లి ఐటీ పార్కులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి పవన్ కల్యాణ్ చేపట్టే పదవులపైనే పడింది. ఆయనకు ఫలానా పదవి కట్టబెడతారని భారీ చర్చ జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని విజయం సాధించింది. మొత్తం సీట్లలో 95 శాతం కొల్లగొట్టి విజయకేతనం ఎగురవేసింది. దాదాపు 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకొని వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసేసింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం జూన్ 12వ తేదీన కొలువు దీరేందుకు రెడీగా ఉంది.

    అయితే ఏపీ ఎన్నికల గెలుపులో కీలక పాత్రను పోషించిన జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. తమ పార్టీకి ఎన్ని మంత్రులు దక్కబోతున్నాయన్న విషయం పై రకరకాల ఊహగానాలు వెలువడుతున్నాయి. అయితే వాటిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇంత వరకు రాలేదు. ఇక పవన్ కల్యాణ్ ఏ పదవి తీసుకొంటారనే విషయం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చకు దారి తీసింది. అయితే ఆయన డిప్యూటీ సీఎంగా పదవి ప్రమాణం చేస్తారనే ఊహగానాలపై పార్టీ కూడా మౌనం పాటిస్తోంది. అయితే పదవుల పంపిణీకి.. కేంద్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మరణం కొంత బ్రేక్ వేశాయి. తాజా మీడియా కథనాల ప్రకారం.. పవన్ కల్యాణ్ రెండు కీలక బాధ్యతలను చేపట్టబోతున్నారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా, అలాగే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ తీసుకొనే నిర్ణయం ప్రకారం మార్పులు చేర్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...