Indian Cricket Team ప్రపంచంలోనే ఇండియా క్రికెట్ టీంకు మంచి గుర్తింపు ఉంది. సచిన్, కపిల్, ధోనీ, ఇప్పుడు విరాట్. వీరంతా బెస్ట్ సక్సెస్ బ్యాట్స్ మన్స్, బౌలర్. దేశం తరుపు జట్టులో ఆడాలని ప్రతీ క్రికెటర్ కల. కానీ ఆ చోటు దక్కడం అంతా ఆశామాశీ కాదు. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కో సారి అది సాధ్యం కాదు. కావాల్సినంత ప్రతిభ ఉన్నా కొందరు రాణించలేకపోయారు. ఈ కోవకు చెందిన ఆటగాళ్లలో అంబటి రాయుడు, కరుణ్ నాయర్, వసీం జాఫర్, ఇర్ఫాన్ పఠాన్, దినేశ్ కార్తీక్ ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.
అంబటి రాయుడు..
2019 ప్రపంచకప్‌కు ముందు జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించాడు. 2019 వరల్డ్ కప్ కోసం ఆటగాళ్లను సెలెక్ట్ చేసే క్రమంలో సెలక్టర్లు త్రీడీ ఆటగాడికి ప్రాధాన్యత ఇచ్చి జట్టు నుంచి రాయుడును తొలగించారు. ఈ ప్రపంచకప్‌లో స్టాండ్‌బై ప్లేయర్‌గా రాయుడు ఉన్నాడు. ఇందులో ఆటగాళ్లకు గాయాలైనా కూడా సెలెక్టర్లు ఇతన్ని జట్టులోకి తీసుకోలేకపోయారు. అంబటి కల నెరవేరకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.
కరుణ్ నాయర్..
ఈ ప్లేయర్ ఇంగ్లండ్ జట్టుపై 2016లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఇతన్ని ట్రిపుల్ సెంచరీ కూడా జట్టులో చోటు కలిపించలేకపోయింది. ట్రిపుల్ సెంచరీ బాదిన నాయర్‌కు చోటు దక్కకపోవడం క్రికెట్ చరిత్రలో దురదృష్టమైన ఘటనగా మిగిలిపోయింది.
వసీం జాఫర్..
‘ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్’ గా పేరు గాంచిన జాఫర్ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేశాడు. అతని 186 వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ముంబై తరపున ఆడుతున్న సమయంలో 14609 పరుగులను పూర్తి చేశాడు. అతని కెరీర్‌లో 46 సెంచరీలు చేశాడు. 2000వ సంవత్సరంలో క్రికెట్ లో అడుగు పెట్టిన జాఫర్ 31 టెస్టు మ్యాచ్‌ల్లో 1944 రన్స్ సాధించాడు. 34.11 రన్ రేట్ తో ఈ ఘనత సాధించాడు. ఆ సమయంలో భారత జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ గల వసీం జాఫర్ భారత జట్టులో జరుగుతున్న ప్లేయర్స్ రొటేషన్స్ వల్ల జట్టులో స్థానం పొందలేకపోయాడు.
ఇర్ఫాన్ పఠాన్..
పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసుకొని రికార్డ్ ను కైవసం చేసుకున్నాడు. అప్పట్లో అతన్ని జూనియర్ కపిల్ దేవ్ గా పిలిచేవారు. ఆ సమయం లోనే టీం ఇండియా కు కోచ్ గా గ్రెగ్ చాపెల్ వచ్చాడు. పఠాన్‌ను ఆల్ రౌండర్‌గా మార్చే ప్రక్రియలో బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టమని సూచించాడు. అయితే బౌలింగ్ ను, బ్యాటింగ్ ను సమన్వయం చేసుకోవడంలో విఫలం అయి జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అతడు 173 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి గుర్తింపు తెచ్చుకున్న పఠాన్ కెరీర్ కనుమరుగైపోయింది.
దినేష్ కార్తీక్..
నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ అత్యద్భుతం అని క్రికెట్ అభిమానులు చెబుతారు. దినేశ్ కార్తీక్ దేశవాళీ క్రికెట్ లో మంచి క్రికెటర్ గా అందరి మన్నలను పొందగలిగాడు. కానీ తాను అంతర్జాతీయం గా ఆడిన మొదటి మ్యాచ్ లో ఓపెనర్ గా రావడం అతనికి కలిసిరాలేదు. ఈ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. దీంతో దినేశ్ కు ఎక్కువ అవకాశాలు దొరకలేదు. వికెట్ కీపింగ్ లోనూ రాణించగల కార్తీక్ కు ధోనీ కీపర్ గా ఉండటం వల్ల రెండవ స్థానంలో వికెట్ కీపర్‌గా ఉండేవాడు.
చాలా మంది క్రికెటర్లు ఎంతో ప్రతిభ ఉండి కూడా పరిస్దితుల ప్రభావం వల్ల ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడలేకపోయారు.