
Dream for RCB : ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆర్సీబీ కల మరోసారి చెదిరిపోయింది. ఆదివారం చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో RCB ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్‌కు 198 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే దానిని సాధించింది.
ఆర్సీబీ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగో జట్టుగా అవతరించింది. 52 బంతుల్లో 104 పరుగులతో అజేయంగా నిలిచిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ విజయానికి బాటలు వేశాడు. గిల్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. గిల్ చెలరేగడంతో విరాట్ కోహ్లీ కష్టం నీళ్లపాలైంది. కోహ్లీ సెంచరీ వృథా అయ్యింది. రెండు కీలక మ్యాచ్ లలో విజయం కోసం కోహ్లీ తన శ్రమనంతా ధారబోసినా ఫలితం లేకుండా పోయింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ లో విరాట్అద్భుత సెంచరీతో స్టేడియం అంతా అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయింది. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుష్క శర్మ కోహ్లీ సెంచరీ అనంతరం ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో మెమర్స్ కి కావాల్సినంత మెటీరియల్ దొరికినట్లయ్యింది. కానీ శుభ్మన్ గిల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ కు ఆర్సీబీ చేతులెత్తకతప్పలేదు.
ఈసారి కప్ మనదే..
‘ఈసాలా కప్ మనదే అన్న మాటను నిలబెట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఈసారి కప్ గెలవాలని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సబీ ప్లే ఆఫ్స్‌కు చేరేది. కానీ దురదృష్టం గిల్ రూపంలో వెంటాడింది.
ఆర్సీబీ ఓటమితో ఆటగాళ్లు ఒక్కసారిగా ఏమోషనల్ అయ్యారు. సెంచరీతో ఆనందంలో ఉన్న కోహ్లీ కన్నీరు పెట్టుకున్నాడు. మ్యాచ్ ఆఖరిలో డగౌట్‌లో కూర్చొన్న విరాట్.. తన జట్టు ఓటమితో నిరాశలో కూరుపోయినట్లుగా కనిపించాడు. జట్టు విజయం కోసం పోరాడిని తన సహచరుల్లో మనో నిబ్బరం కల్పించేందుకు మైదానంలోకి వచ్చి అభినందించాడు. మ్యాచ్ ఓటమితో కోహ్లీ కన్నీరు పెట్టుకున్న ఫొటో, వీడియో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులను బాధకు గురి చేస్తున్నది. ‘ గెలిచినా.. ఓడినా.. ఎప్పటికీ నువ్వు మా కింగ్’ అంటూ కోహ్లీకి మద్దుతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న బౌలర్ సిరాజ్ కూడా ఓటమితో మైదానంలోనే కూలబడిపోయాడు.