27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Upasana Baby Girl : ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట ప్రిన్సెస్ సందడి.. వరుస ట్వీట్స్ తో ప్రముఖులు

    Date:

    Upasana baby girl
    Upasana baby girl

    Upasana baby girl : మెగాస్టార్ చిరంజీవికి మనుమరాలు వచ్చింది. రాం చరణ్-ఉపాసన ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఉపాసనకు డెలివరీ డేట్ దగ్గరవడంతో సోమవారం (జూన్ 19) అపోలో హాస్పిటల్ లో చేర్చారు. మంగళవారం (జూన్ 20) ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగాస్టార్ ఇంట సందడి నెలకొంది. తన వారసురాలిని చూసుకొని చిరంజీవి-సురేఖ ఆనంద భాష్పాలు రాల్చారు. కొడుకుకు వివాహమైన పదేళ్ల తర్వాత పుట్టిన సంతానం కావడంతో బాగా గారాబంగా చూసుకునేలా ఉన్నారు.

    అయితే రాం చరణ్ తండ్రి అయిన సందర్భంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. గతంలో తనకు ఆడపిల్లే పుట్టాలని కోరుకున్న రాం చరణ్ కు ఆయన కోరిక మేరకు ఆడపిల్ల పుట్టడంతో మరింత ఆనందంగా ఉన్నాడు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

    Upasana Baby Girl
    Upasana Baby Girl

    మనుమరాలిని ఇచ్చిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొడుకు కోడలుకు శుభాకాంక్షలు చెప్పారు. ‘మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. ప్రిన్సెస్ నువ్వు వారిలో ఆనందాన్ని పంచావు. నీకు రాం చరణ్, ఉపాసన ఆశీర్వాదాలతో పాటు కోట్లాది మంది మెగాఫ్యాన్స్ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇంకా నీ తాత-నానమ్మ ఆశీర్వాదం కూడా నీపై ఎల్లప్పుడూ ఉంటుంది’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

    ‘రాం చరణ్ ఉపాసనకు శుభాకాంక్షలు. పేరెంటింగ్ క్లబ్ కి సాదరంగా స్వాగతిస్తున్నాం. ఆడ బిడ్డతో గడిపే ప్రతీ క్షణం లైఫ్ లో మరువలేనిది. బిడ్డకు మీకు మరింత సంతోషం ఇవ్వాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. అయితే రాం చరణ్, మెగా ఫ్యాన్స్ తారక్ కు ధన్యవాదాలు తెలిపుతూ రీ ట్వీట్ చేశారు.

    ఇక మహేశ్ బాబు కూడా ట్విటర్ వేధికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభాకాంక్షలు రాం చరణ్ అండ్ ఉపాసన. ఇది మీ ఇంట్లో ఒక కొత్త పండుగ రోజు. పేరంట్ క్లబ్ లోకి స్వాగతం’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లతో ట్విటర్ జామై పోయేలా కనిపించింది.

    ఇక మెగా, రాం చరణ్ ఫ్యాన్స్ నేరుగా అపోలో హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ మెగా ప్రిన్సెస్ ను చూసేందుకు వేచి ఉన్నారు. వారి విషెస్ తో మెగాస్టార్ ఫ్యామిలీ ఆనందంలో ఉంది. మీ ఆశీర్వాదాలు మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Princess : నేడే మెగా ప్రిన్సెస్ బారసాల.. ఇదే పేరు అంటూ వైరల్?

     Mega Princess :  మెగా ఇంటికి ప్రిన్సెస్ వచ్చి నేటికి సరిగ్గా...

    Mega Princess : మెగా ప్రిన్సెస్ కు బంగారు ఉయ్యాల.. గిఫ్ట్ పంపిన ముఖేశ్ అంబాని..

    Mega Princess  :  మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుంచి నిత్యం వార్తల్లో...

    Mega Little Princess : మెగా ప్రిన్సెస్ ను చూశారా..? అచ్చం అలాగే ఉందిగా..!

    Mega Little Princess : రాం చరణ్-ఉపాసనల కూతురు మెగా ప్రిన్సెస్...