Telangana BRS :
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేయబోతున్నదని సమాచారం. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత హడావిడి మొదలుపెట్టారు. 115 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. మిగతా పార్టీలకంటే ముందుగానే సీఎం కేసీఆర్ సమరానికి సై అన్నారు.
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా ప్రచారంలోకి దిగలేదు. కేవలం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెక్కులను అందజేస్తూ మమా అనిపిస్తున్నారు. సీఎంఆర్ ఎఫ్ కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు లాంటి చెక్కులను అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రజల్లోకి మాత్రం వెళ్లలేదు.
గత ఎన్నికల సమయంలో అసెంబ్లీని రద్దు చేసిన సమయంలోనే ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే వేడిలో ప్రచారానికి వెళ్లారు. హైదరాబాద్ లో 10 లక్షల మంది తో సభ పెట్టారు. ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికి పంపించి ప్రభుత్వ పథకాలపై ప్రచారాలు నిర్వహించారు. కానీ ఈసారి ఆ దూకుడు కనపడలేదు ఎమ్మెల్యేలంతా కేవలం ప్రభుత్వ పథకాలను అందించే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా జిల్లాలో పర్యటనలకు వెళ్లడం లేదు. మంత్రి కేటీఆర్ కూడా ఇటీవలే విదేశీ పర్యటన కు వెళ్లి వచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఉత్సాహంగా ప్రచారానికి వెళ్లడం లేదు. మరోవైపు కాంగ్రెస్ దూకుడుగా దూసుకు వస్తున్నది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ వ్యూహం ఏంటో అర్థం కావడం లేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడే జనాల్లోకి వెళ్తే, ఒక్కోసారి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఏ ఒక్క ఇష్యూ జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది కర పరిస్థితి ఎదురవుతుంది. మరోవైపు ఎన్నికలు కొంత ఆలస్యమైనా , ప్రచారం ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే ఇప్పుడే ప్రచారం లో దిగవద్దని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇక షెడ్యూల్ విడుదల అయ్యాకే ప్రచారంలో కి వెళ్లాలని అనుకుంటున్నారు.
ReplyForward
|