
Markandeyudu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుని అప్పుడే పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది.
ఎటువంటి గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేయడంతో ఫాస్ట్ గా పూర్తి అయ్యింది. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించగా ఆ సమయంలోనే ఈయన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇందులో పవన్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.
పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ అండ్ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా పవర్ స్టార్ సరికొత్త ట్రెండ్ సృష్టించాడు.. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం సాయి తేజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.
ఈ సినిమాలో సాయి తేజ్ మార్కండేయుడు (మార్క్) పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.. ఈ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది అనే చెప్పాలి.. సాయి తేజ్ ఫుల్ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే లుక్ లో సూపర్ గా ఉన్నాడు.. ఈ పోస్టర్ కు కూడా ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమాను జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు..