
Pushpa The Rule : ”పుష్ప ది రూల్”.. ఈ సినిమాపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2.. ఈ సినిమా కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరు.. దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాదు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పుష్ప ది రైజ్ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పుష్ప రిలీజ్ సమయంలో నార్త్ లో ఎలాంటి అంచనాలు లేవు.. కానీ రిలీజ్ తర్వాత పుష్పరాజ్ కు ప్రతీ ఒక్కరు ఫ్యాన్స్ అయ్యారు.. ఈయన టాలెంట్ కు అక్కడి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.. అప్పటి నుండి అల్లు అర్జున్ కు మరింత ఫ్యాన్స్ అయ్యారు.. ఇక ఈ సినిమా కథ పార్ట్ 1 తోనే పూర్తి అవ్వక పోవడంతో పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్..
గత కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా షూట్ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 2 లో చాలా మంది స్టార్స్ ను భాగం చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చాడు.. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ పార్ట్ 1 లో పోలీస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఫహద్ కు బన్నీకి మధ్య అదిరిపోయే సీన్స్ ఉన్నాయని టాక్.. ఈ క్రమంలోనే మేకర్స్ ఫహద్ గురించి అప్డేట్ ఇచ్చారు.. పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ నటిస్తున్న భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర షూట్ ను పూర్తి చేసారని ఈయన నటన మీకు ఎప్పటికి గుర్తుండి పోతుంది అని చెప్పుకొచ్చారు మేకర్స్.. సుక్కు, ఫహద్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.