
Uppalapati Shyamala Devi : ప్రస్తుతం సినీ సెలెబ్రిటీలే కాదు వారి వారసులు కుటుంబ సభ్యులు సైతం ఒక్కొక్కరిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ రాజీకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుంది అంటున్నారు.
ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ వైసీపీకి అత్యంత దగ్గరైన పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్ సభ నుండి ఆమె పోటీ చేయనున్నారు.. ఆ స్థానం ఎప్పటికి వైఎస్సార్ సీపీ దే అయినా కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండే రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న రఘురామకు బదులుగా నర్సాపురం టికెట్ ను కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి గారికి ఇచ్చి ఆమెను రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ మేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.. ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్సార్ సీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న లోక్ సభ సభ్యుడు ఇప్పటికే ఈ సంకేతాలను కూడా పంపించినట్టు తెలుస్తుంది.. కానీ శ్యామలాదేవి మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.. ఈ నియోజక వర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంక్ కావడం శ్యామలాదేవి కూడా అదే సామజిక వర్గానికి చెందిన ఆమె కావడం ఇప్పుడు ఈమెనే రంగంలోకి దించేటట్టు కనిపిస్తుంది.
|
ReplyForward
|






