Mattu Vadalara 2 : సాధారణంగా సీక్వెల్ అంటే ఆశించినంత విజయం సాధించదు. ఇది చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుంది. కానీ ఇలాంటి అంచనాలను తలకిందులు చేస్తూ టిల్లు స్క్వేర్ హిట్ సాధించింది. కామెడీ ట్రాక్ తో సాగిన ఈ మూవీ సక్సెస్ సాధిస్తుందని అందరూ ఆది నుంచే నుంచే అంచనా వేశారు. అనుకున్నట్లుగానే భారీ విజయం దక్కించుకుంది. దీనికి టిల్లూ క్యూబ్ పేరుతో మరో మూవీ రాబోతోందని అనౌన్స్ కూడా చేశారు. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి వర్క్ జరగడం లేదని మాత్రం తెలుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ‘మత్తు వదలరా’కు సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ వచ్చింది. ఇది కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇది కూడా కామెడీ ట్రాక్ లో సాగడంతో మంచి సక్సెస్ సాధించింది. యూఎస్ బాక్సాఫీస్ లో అదరగొట్టిందనే చెప్పాలి.
మత్తు వదలరా 2కు మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ పార్ట్ కు ఏకగ్రీవ ప్రశంసలు లభించగా, సీక్వెల్ కు యావరేజ్ రివ్యూలు మాత్రమే వచ్చాయి. అయినా, ఈ వెర్షన్ లో సత్య కామెడీ అదిరిపోయిందని విమర్శకులందరూ హైలైట్ చేశారు. యావరేజ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది.
ఈ చిత్రం ఇప్పటికే 200 వేల డాలర్లు వసూలు చేసింది. ఇది ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాకు గణనీయమైన మొత్తం. బ్రాండ్ పేరు ఖచ్చితంగా దాని విజయానికి దోహదం చేసింది. తొలి వారంలోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని దర్శక, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాని నటించిన సరిపోదా శనివారం వంటి సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద రన్ పూర్తి చేసుకున్నాయి. దేవర విడుదల వరకు పెద్దగా పోటీ లేకపోవడంతో మత్తు వదలరా 2 తన జోరును కొనసాగించే అవకాశం ఉంది.