
H1 visa renewal : అమెరికా వెళ్లాలంటే వీసా అవసరం. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారికి గ్రీన్ కార్డు తీసుకుంటే పలు సదుపాయాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలనుకుంటే ఎవరికైనా హెచ్ 1 వీసా అవసరం ఉంటుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగిన చర్చల్లో ఈ విషయంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. గురువారం వీరి మధ్య జరిగిన సమావేశంలో హెచ్ 1 బి వీసా గురించి పలు కోణాల్లో చర్చించినట్లు సమాచారం.
హెచ్ 1 బీ వీసాలను రెన్యూవల్ చేసుకునేలా ఒక పైలెట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని కింద కొంతమంది విదేశీయులకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. దీని కోసం పలు నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. అమెరికా కంపెనీలు విదేశాలకు చెందిన నిపుణులను నియమించుకునేందుకు హెచ్ 1 బి వీసా అవకాశం కల్పిస్తుంది.
అమెరికాకు వెళ్లేవారిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. 2022 సంవత్సరంలో 4.42 లక్షల మంది హెచ్ 1 బి వీసా వినియోగదారుల్లో 73 శాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వీసా స్టాంపింగ్ కోసం ఆయా దేశాల్లో అమెరికన్ కాన్సులేట్ లో దరఖాస్తులు చేసుకోవాలి. వీసా కోసం ఎదురు చూసే వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది.
భారత్, అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోడీ మధ్య చర్చలు జరగడంతో ఇక వీసాల జారీలో ఉన్న నిబంధనలను సరళించనున్నట్లు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో స్వదేశానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. వీసా అపాయింట్ మెంట్ లో చోటుచేసుకుంటున్న జాప్యం ఇక మీదట తొలగనుందని వారి చర్చల ద్వారా తెలుస్తోంది.