
Ustad Bhagat singh Glimpses Pawan who gave Jagan away : పవన్ కళ్యాణ్ చాలా వరకు సినిమాల్లో దేశభక్తి టచ్ ఉంటుంది. తన కెరీర్ మొదటి నుంచి ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ విధంగానే సాటలు, కంటెంట్ ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రాను రాను వేడిక్కిస్తుంది. ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గత నాలుగేళ్ల నుంచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రిగా ఎన్నికై తనదైన తరహాలో పాలన అందించాలని ఆయన కష్టపడుతున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ పార్టీకి ఆయన చుక్కలు చూపిస్తున్నారు.
ఇక గురువారం (మే 11) రోజున Ustad Bhagat singh Glimpses రిలీజ్ అయ్యింది. కేవలం నిమిషం మాత్రమే ఉన్న ఈ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ ను టార్గెట్ చేసేలా కనిపిస్తుంది. ‘దుర్మార్గం హద్దులు దాటినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు’ అనే భగవత్ గీత స్లోకంతో గ్లిమ్స్ మొదలవుతుంది. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని చెప్పారు ఆయన. ఇక దీంతో పాటు ఇందులో రెండు సార్లు జనసేన పార్టీ సింబల్ ఉన్న గ్లాసును చూపించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలకపక్షానికి వార్నింగ్ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నట్టుంది పవన్ కళ్యాణ్. పర్ఫార్మెన్స్ పరంగా చించివేస్తారని తెలుస్తోంది. ఈ గ్లిమ్స్ తో వైసీపీ ప్రభుత్వానికి నేరుగా హెచ్చరిక పంపించారు పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. గత ఎన్నికల నుంచి నేర్చుకున్న పాఠాలను వైసీపీకి అప్పజెప్తారని చెప్పకనే చెప్పారు పవన్.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ గ్లింబ్స్ కు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. 11 సంవత్సరాల తర్వాత మళ్లీ హరీశ్-పవన్ కళ్యాణ్ కాంబో తెరపైన చూడుబోతున్నందుకు ఆనందంగా ఉందని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు.
Power packed glimpse from the Power house himself! #UstaadBhagatSingh cannot look more fabulous than this.@Harish2you @MythriOfficial https://t.co/wXJEhF8uRm
— Samyuktha (@iamsamyuktha_) May 11, 2023






