
Ustad Bhagat Singh update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్”.. గబ్బర్ సింగ్ తో ఇద్దరు కూడా తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. మళ్ళీ 11 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు..
ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఉస్తాద్ నుండి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.. గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన డేట్ కే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవ్వడంతో హరీష్ శంకర్ సెంటిమెంట్ తో ఉస్తాద్ గ్లిమ్స్ ను అదే రోజు ప్లాన్ చేసారు.. మరి ఈ టీజర్ మొత్తం ఫ్యాన్స్ కు స్పెషల్ గా కిక్ ఇచ్చే విధంగా కట్ చేసి వావ్ అనిపించారు..
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరో న్యూస్ బయటకు వచ్చింది.. కొద్దీ రోజుల క్రితమే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.. కేవలం 15 రోజుల షూటింగ్ జరుగగా దాంట్లోనే టీజర్ కట్ చేసి హరీష్ వదిలాడు.. కేవలం ఈ 15 రోజుల షూటింగ్ తోనే పవన్ ను అంత గొప్పగా చూపించి తనలోని యాటిట్యూడ్, స్టైల్, స్వాగ్ ను ఫ్యాన్స్ కు మరోసారి ఏ లెవల్లో ఉంటుందో చూపించాడు..
ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ వచ్చే నెల 26 నుండి స్టార్ట్ కాబోతుంది అని టాక్.. ఈ షెడ్యూల్ కు సంబంధించిన వర్క్ కూడా పూర్తి చేసింది అని స్కూల్ ఇంకా చుట్టుపక్కన ఉండే పోలీస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు పవన్ వాడే జీప్ కూడా ఈ సెట్స్ లో ఉన్నాయట.. 26న అదిరిపోయే మాస్ పోస్టర్ ను రిలీజ్ చేసి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఫుల్ స్వింగ్ లో షూట్ జరిపేందుకు సిద్ధం అవుతుంది టీమ్..