‘Ustad’ Movie Review : తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. మత్తు వదలరా అనే సినిమాతో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే ఆకట్టుకున్నాడు.. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలతో అలరించిన శ్రీసింహ ఇప్పుడు ‘ఉస్తాద్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు..
బలగం వంటి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఫేమ్ తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించారు.. ఆగస్టు 12న ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూసేద్దాం..
నటీనటులు :
శ్రీసింహ కోడూరి
కావ్య కళ్యాణ్ రామ్
గౌతమ్ వాసుదేవ్ మీనన్
రవీంద్ర విజయ్ తదితరులు..
డైరెక్టర్ : ఫణిదీప్
మ్యూజిక్ డైరెక్టర్ : అకీవ బి
నిర్మాత : రజిని కొర్రపాటి, రాకేష్ రెడ్డి, హిమాంక్ రెడ్డి
కథ :
శ్రీసింహ ఎత్తైన ప్రదేశాలంటే చిన్నప్పటి నుండి భయం.. ఆ భయం తనతో పాటు పెరుగుతూ వచ్చింది. అయితే ఇతడు కొన్ని అవమానాల కారణంగా పైలెట్ కావాలని అనుకుని విమానం నడపాలని కలలు కంటుంటాడు.. అలాగే పైలెట్ అవ్వగా ఈయన తన బాస్ గౌతమ్ వాసుదేవ్ తిట్ల నుండి తప్పించుకునేందుకు మాట్లాడుతూనే ఉంటాడు..
ఈ క్రమంలోనే తన బైక్ ఉస్తాద్ గురించి తన లవ్ స్టోరీ గురించి ఆయనకు చెబుతాడు.. మరి ఈ రెండు తన లైఫ్ ను ఎలా ప్రభావితం చేసాయి.. లవ్ అండ్ బైక్ ను వదిలేసి పైలెట్ ఎందుకు అయ్యాడు? అనేది మిగిలిన కథ..
విశ్లేషణ :
రాజమౌళి, కీరవాణి వంటి దిగ్గజాల సపోర్ట్ లేకుండా తనను తాను హీరోగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేయడం అభినందించాల్సిన విషయం.. అయితే ఇంత మంది లెజెండరీస్ ఉన్న ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ సింహ ఇలాంటి కంటెంట్ లేని కథల ఎంపికను ఎలా చేసుకుంటున్నాడు అనేది అందరి డౌట్.. ఈయన సినిమాల్లో ఏది చెప్పుకోదగిన హిట్ కాలేదు.. ఇప్పుడు ఉస్తాద్ విషయంలోనూ ఇదే జరిగింది.
పర్ఫార్మెన్స్ :
డైరెక్టర్ ఫణిదీప్ కథ బాగానే రాసుకున్న దానిని తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయారు. కథలో క్లారిటీ లేకపోవడం అనవసరమైన సన్నివేశాలు ఇరికించడం, ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్ధం కాలేదు. ఇది ఒక బైక్ బయోపిక్ లా ఉంది.. సినిమాలో మంచి ఫీల్ ఉన్న దానిని సరిగ్గా చూపించలేక పోయారు. కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
శ్రీసింహ అయితే తన నటనతో మెప్పించాడు.. బైక్ తో అతడి ఎమోషన్ బాగా ఆకట్టుకుంది.. ఇక కావ్య మరోసారి తన నటనతో మెప్పించింది.. మ్యూజిక్ కొంత మేర మాత్రమే మెప్పించింది.. ఆర్ ఆర్ బాగుంది.. నిర్మాణ విలువలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించాయి..
చివరిగా.. సినిమాలో కంటెంట్ ఏమాత్రం లేదు.. ఉస్తాద్ అనే బైక్ తప్ప ప్రేక్షకులను ఆకట్టుకునే రేంజ్ లో లేదు..
రేటింగ్ : 2/5