
Valentines Day Movies : వచ్చే బుధవారం (ఫిబ్రవరి 14) వాలెంటైన్ డే ఉండడంతో వీకెండ్ లో కాస్త పాత వైన్ ను విడుదల చేయడం ద్వారా లవ్ వీక్ ను క్యాప్చర్ చేయాలని సినీ ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రంతో పాటు ఈ వీకెండ్ లో కొన్ని పాత సినిమాలు థియేటర్లలోకి రీ రిలీజ్ కానున్నాయి. అవేంటో ఒక సారి లుక్కేయండి.
ఈ వీకెండ్ లో ‘ఊరి పేరు భైరవకోన’ కొత్త సినిమా విడుదల కానుండగా, 4 రీరిలీజ్ లు లైన్ లో ఉన్నాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ బేబీ మళ్లీ రిలీజ్ కానుండగా.. ఫిబ్రవరి 14న ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. గత బ్లాక్ బస్టర్ సీతా రామం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో చాలా కాలం క్రితం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాని రెండు సినిమాలు, లవ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ సినిమాలు కూడా రీ రిలీజ్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు వాలెంటైన్ వీకెండ్ లో రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.
అంతే కాదు పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో పాటు టైటానిక్, డీడీఎల్జే, జబ్ వీ మెట్, వీర్ జారా, మొహబ్బతేన్ వంటి టైమ్ లెస్ హిట్స్ కూడా వాలెంటైన్ డే సందర్భంగా విడుదలవుతున్నాయి. మరి ఈ రీ రిలీజ్ లు నిజంగానే సినిమా లవర్స్ ను, లవర్స్ హృదయాలను కొల్లగొడతాయా..? అని చాలా మంది ఆలోచిస్తున్నారు.