
Vallabhaneni Vamsi : రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని ఆసుపత్రికి చేరుకుని వైద్యులనుండి వివరాలు తెలుసుకున్నారు. వంశీ ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో ఎయిమ్స్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడింది. వంశీపై ఇప్పటివరకు ఏడు కేసులు నమోదు కాగా, ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్‌లో ఉన్నారు.






