25.9 C
India
Monday, December 15, 2025
More

    Vangalapudi Anita : వంగలపూడి అనితకు 20వ ర్యాంక్.. హోంమంత్రి మార్పు తప్పదా?

    Date:

    Vangalapudi Anita
    Vangalapudi Anita

    Vangalapudi Anita : తిరుపతి లడ్డూ, హోం మంత్రిత్వ శాఖ, రేషన్ బియ్యం వంటి అంశాల్లో హడావిడి చేస్తూ సంచలన ప్రకటనలు చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని తీరు ఆధారిత ర్యాంకుల్లో మాత్రం దిగువకు పడిపోయారు. ఆయన ఏకంగా పదో స్థానంలో ఉన్నారు. ఏయే మంత్రులు టాప్‌లో ఉన్నారు, ఎవరు అడుగున ఉన్నారో తెలుసుకుందాం.

    పని తీరు ఆధారంగా రాష్ట్రంలోని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులిస్తున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వ కేబినెట్ మంత్రులకు చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పదవ ర్యాంకు దక్కించింది. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. పైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకుల నిర్ణయం జరిగింది. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొదటి స్థానంలో మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ఉంటే రెండో స్థానంలో కందుల దుర్గేశ్ నిలిచారు. ఇక మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదవ స్థానంలో బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 7వ స్థానంలో నిలిచారు. ఇక ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలోనూ బీసీ జనార్ధన్ రెడ్డి 9వ స్థానంలోనూ ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానానికి పరిమితమయ్యారు. 11వ స్థానంలో మంత్రి సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర నిలిచారు. 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్ ఉన్నారు. ఇక 16వ స్థానంలో ఆనం రాంనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాం ప్రసాద్ రెడ్డి ఉన్నారు.

    19వ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్య ప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్ధసారధి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్ ఉంటే చిట్టచివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.

    పాలనలో ఎంతో హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ కు ఏకంగా 10వ స్థానం దక్కడం చూసి మక్కున వేలేసుకుంటున్నారు. ఇక పవన్ విమర్శించిన హోంమంత్రి అనిత అయితే 20వ స్థానంలోకి పడిపోవడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ప్రతి సారి హోమ్ మంత్రి పై కామెంట్స్ చేస్తూ ఆమె సరిగ్గా చేయడం లేదని అంటున్నాడు. చంద్రబాబు ను ప్రకటించిన ర్యాంక్ లో కూడా 20 వ స్థానంలో అనిత రావడంతో ఆమె మార్చు ఉండొచ్చా అనే ఊహగణాలు వ్యక్తమవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : ఏపీ మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు!!

    Chandrababu : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీని కాపాడేందుకు తెలుగు...

    Jagan Politics : మార్చాల్సింది మంత్రులను, ఎమ్మెల్యేలను కాదు.. ఆయన్నే!

    Jagan Politics : పాలన సాఫీగా సాగితే అంత తన వల్లే...

     Megastar : మెగాస్టార్ పై ఏపీ మంత్రుల మాటల దాడి.. కౌంటర్ ప్రెస్ మీట్లు

    Megastar : మెగాస్టార్ చిరంజీవి పై ఏపీ మంత్రులు మాటల దాడి...

    Vangalapudi Anita : సిగ్గుండాలి అనితా ఆంటీ.. మరీ ఇలాంటి దిగజారి ఆరోపణలు చేయడానికి..

    Vangalapudi Anita : 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు పెన్షన్ కోసం వలంటీర్లను...