25.9 C
India
Monday, December 15, 2025
More

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Date:

    Varalakshmi Wedding Invitations
    Varalakshmi Wedding Invitation to PM Modi

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొద్దిమంది మాత్రమే స్టార్ స్టేటస్ దక్కించుకుంటున్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వైవిధ్యమైన పోషిస్తూ మంచి పేరు సాధించకుంది. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్ విమర్శకుల ప్రశంసలు పొందుతూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు చాలామంది తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ వరుసలో వరలక్ష్మి కూడా ఉన్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.

    వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల వరలక్ష్మికి తన ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌ తో ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది బంధువులు, సన్నిహితుల మద్య వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి విషయంపై రక రకాల రూమర్స్ వినిపించాయి. వాటన్నింటికి పులిస్టాప్ పెడుతూ పెళ్లి ఎక్కడ.. ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. వరలక్ష్మీ శరత్ కుమార్ తాను ప్రేమించిన నికోలై సచ్‌దేవ్‌ తో జులై 2 న థాయిలాండ్‌లో పెళ్లి చేసుకోతున్నట్లు తెలుస్తోంది. వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    Varalakshmi Wedding Invitation to Balakrishna Family
    Varalakshmi Wedding Invitation to Balakrishna Family

    ఈ వివాహ వేడుక మొత్తం శరత్ కుమార్ రాధిక దంపతులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వివాహ వేడుకకు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరలక్ష్మీ, నికోలై సచ్‌దేవ్‌, శరత్ కుమార్, రాధిక ప్రధాని మోడీని కలిసి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు. మోడీతో పాటు ఇతర ప్రముఖ రాజకీయవేత్తలను ఆహ్వానించారు.

    మోదీ దగ్గరకు శరత్ కుమార్, రాధిక, సచ్ దేవ్, వరలక్ష్మి అంతా కలిసి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురికి ఆహ్వానం అందించింది వరలక్ష్మి. బాలయ్య దంపతులను స్వయంగా కలిసి తన పెళ్లికి రావాలని వరలక్ష్మి ఆహ్వానించింది. ప్రస్తుతం వరలక్ష్మి ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related