Varla Ramaiah : రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ, టీడీపీ రెడీ అయ్యాయి. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి బలమున్నా టీడీపీకి మాత్రం బలం లేదు. కానీ పోటీలో మాత్రం నిలిచింది. ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే ఉద్దేశంతో టీడీపీ నుంచి కూడా ఓ అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది. రాజ్యసభ అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు పలు కోణాల్లో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మాదిరి రాజ్యసభ ఎలక్షన్లలో కూడా గెలవడానికి అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. సంఖ్యాపరంగా వైసీపీకే మూడు స్థానాలు దక్కుతాయి. కానీ టీడీపీలో ఏ మూలకో చిన్న ఆశ ఉండటంతో అది కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగినట్లే క్రాస్ ఓటింగ్ పై నమ్మకం పెట్టుకున్నారు. అప్పుడు ఉపయోగించిన కులం కార్డునే ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం కార్డును ఉపయోగిస్తున్నారు. గతంలో రాజ్యసభకు పోటీ చేసి ఓటమి పాలైన వర్ల రామయ్య తన వాయిస్ గట్టిగా వినిపిస్తారనే పేరుంది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఎస్సీ కార్డుతో కొట్టాలని చంద్రబాబు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ నేతలే ఉండటంతో ఎస్సీ కార్డును వాడుతున్నారు. వర్ల రామయ్య రాజ్యసభ ఎన్నికల్లో నిలుస్తారో? లేదో తెలియండం లేదు. మొత్తానికి వైసీపీ, టీడీపీల పోరులో రాజ్యసభ స్థానాల్లో ఎవరికి ప్లస్ అవుతుందో చూడాలి మరి. గతంలో జరిగిన మాదిరి ఇందులో కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతందా? ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని సమాచారం.