
Varun-Lavanya : తన బాబాయికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిఠాపురంలో ప్రచారం చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కానీ ఆయన భారీ మెజారిటీతో గెలిచి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో మాత్రం వరుణ్ తేజ్ కానీ, ఆయన భార్య లావణ్య త్రిపాఠి గానీ కనిపించలేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపును పురష్కరించుకొని అన్న చిరంజీవి తన ఇంట్లో ట్రీట్ ఇవ్వగా దానికి హాజరైన వరుణ్ తేజ్ దంపతులు ప్రమాణ స్వీకారోత్సవంలో మాత్రం కనిపించలేదు. ఈ ప్రశ్ననే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో కల్లోలాన్ని రేపుతోంది.
పవన్ గెలుపును కోరుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దంపతులు ప్రమాణ స్వీకారానికి రాకపోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అన్నది మెగా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. షూటింగ్, మూవీస్ లో బిజీగా ఉన్నా వరుణ్ తేజ్, లావణ్ త్రిపాఠి నిశ్చితార్థం నుంచి పెళ్లి వేడుకల వరకు పవన్ కళ్యాణ్ ప్రతీ ఒక్కదానిలో పాల్గొన్నారు. చిన్న చిన్న ఫ్యామిలీలోని వేడుకలకు తప్పించి ప్రతీ ఒక్కదానికి అటెండ్ అయ్యాడు.
గాయమే కారణమా?
పవన్ ప్రమాణ స్వీకారోత్సవంపైనే ప్రతీ ఒక్కరి దృష్టి ఉంది. ఎందుకంటే పవన్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. వారి కుటుంబంలోని వ్యక్తి జీవితంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతారు. ఒకానొక దశలో అల్లు ఫ్యామిలీపై కూడ మెగా ఫ్యాన్స్ కన్ను ఉంటుంది. అయితే ఈ వేడుకకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రాకపోవడానికి కారణం గాయమని తెలుస్తుంది. ఇటీవల లావణ్య త్రిపాఠీ కాలుకు గాయం కలిగింది. ఇంట్లోనే నాకు తోడుగా వరుణ్ ఉన్నాడు. కాబట్టి రాలేకపోయానని చెప్తూ ఫొటో కూడా షేర్ చేసింది లావణ్య త్రిపాఠి.