Gandhivadhari Arjuna : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సహ నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో మెగా ఇంట్లో మరో సందడి జరగనుంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన సందర్భంలో వారి ఇంట నవ్వుల జల్లులు కురిశాయి. మరోమారు వరుణ్ పెళ్లితో ఆ ఇంట తాళాలు మోగనున్నాయి. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లి ఒక్కటే మిగిలి ఉంది. ఇది కూడా డిసెంబర్ లో చేస్తారని అనుకుంటున్నారు.
వరుణ్ గాండివధారి అర్జున సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. వరుణ్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సినిమా పోస్టర్ విడుదల కావడంతో అందరికి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందంటున్నారు.
సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ అనుకున్నట్లుగా జరిగితే కచ్చితంగా ఆగస్టులో రిలీజ్ చేయడం ఖాయమంటున్నారు. సినిమాపై అనేక వాదనలు వస్తున్నాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని దీంతో ఆగస్టులో విడుదల ఎలా సాధ్యమవుతుందని టాక్ వస్తోంది. మరోవైపు ఆగస్టులో భోళా శంకర్ విడుదల అవుతున్నందున ఈ సినిమాను వాయిదా వేయాల్సి వస్తుందంటున్నారు.
చిత్రం యూనిట్ మాత్రం సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తోంది. కచ్చితంగా ఆగస్టులోనే విడుదల ఉంటుందని చెబుతోంది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అంటోంది. సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని చెబుతున్నారు.