Varun Tej : ‘ఆపరేషన్ వాలెంటైన్’కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, ఈ దేశభక్తి యాక్షన్ అడ్వెంచర్ లో వరుణ్ తేజ్ నటనకు భారీగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటనకు విమర్శకులు, అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐఏఎఫ్ అధికారి పాత్రను పక్కాగా దింపడంలో నటుడు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమా సక్సెస్ లో చూపెడుతుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు, పోరాటాలను కూడా తెలియజేసింది.
సవాళ్లతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ ఆ పాత్రను చాక చక్యంగా పోషించగలిగాడు. తన కటౌట్, భారీ ఫిగర్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోగా, తన నటనతో మరింత ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో నటించేందుకు వరుణ్ తేజ్ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ఫైటర్ పైలట్ల లైఫ్ స్టయిల్ తెలుసుకునేందుకు ఆయన కొంత మంది నిజ జీవిత ఫైటర్ పైలట్లను కలుసుకున్నాడు. వారితో ఎక్కువ సమయం గడిపాడట. వారి నుంచి చిన్న చిన్న విషయాలను కూడా తెలుసుకున్నారట.
ఇవన్నీ వరుణ్ తేజ్ తన పాత్రలో ఒదిగిపోయేందుకు చాలా దోహదపడ్డాయి. తన కటౌట్ కు పర్ఫెక్ట్ క్యారెక్టర్, సబ్జెక్ట్ దొరికితే కచ్చితంగా నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ మట్కాలో మరో ఛాలెంజింగ్ రోల్ చేయబోతున్నాడు, ఇందులో అతను మరో డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. గతంలో గద్దలకొండ గణేష్ కూడా వరుణ్ తేజ్ కు బాగా గుర్తింపు తెచ్చింది. విలన్ లైఫ్ చుట్టూ తిరిగే ఈ కథ వరుణ్ తేజ్ కు బాగా సూటైంది.