
పద్మ జయంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి చెప్పడంతో పాటు వేణు మాధవ్ తో కలిసి తనపై వచ్చిన రూమర్ల గురించి చెప్పుకచ్చింది. పద్మ జయంతి నేటివ్ ప్లేస్ వరంగల్. ‘హైదరాబాద్ కు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యింది. వెళ్లిన కొన్ని రోజులకే అమ్మా, నాన్న ఇద్దరూ చనిపోయారు. ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు కూడా నన్ను వదిలిపెట్టి గుంటూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో నా స్నేహితుడు అండగా నిలిచాడు. ఆ తర్వాత అతనే నా భర్తగా మారాడు.
మా ఇంటి సమీపంలోనే వేణు మాధవ్ ఇళ్లు కూడా ఉండేది. మాస్టర్ సినిమా నుంచే వేణుమాధవ్ నాకు తెలుసు. ఒక కామన్ ఫ్రెండ్ తో మా ఆయన నాకు వేణు మాధవ్ ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా మారిపోయాం. ఆయన అనారోగ్యాన్ని ఎదుర్కొన్న సమయంలో మా వారు నాతో వంట చేయించి తీసుకెళ్లి ఇచ్చారు. ఇలా చాలా సార్లే జరిగింది. ఒక రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ వద్దకు వెళ్లాను. అక్కడ నన్ను చూసిన ఆయన పద్మ జయంతిని పంపచ్చు కదా అవకాశాలు వస్తాయని నా భర్తకు చెప్పాడు.
అప్పుడప్పుడూ దాదాపు 4 సంవత్సరాల పాటు క్యారేజీ తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. అవకాశాలు అయితే రాలేదు కానీ.. రూమర్లు అయితే బాగానే వచ్చాయి. ఆయనకు నాకు ఏదో ఎఫైర్ ఉందంటూ ఇండస్ట్రీలో బాగా పుకార్లు వినిపించాయి. ‘వేణు మాధవ్ అంటే పద్మా జయంతికి ఇష్టం అందుకే అంతలా సేవలు చేస్తుంది’ అంటూ ఇండస్ట్రీ కోడై కూసింది. కానీ అది అంతా అబద్ధం. నేనే వేణు మాధవ్ కు ఉల్టా డబ్బులు ఇచ్చేదాన్ని ఆయన చనిపోయే వరకు కూడా తిరిగి ఇవ్వలేదు. ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ReplyForward
|