Venuswami :
వేణు స్వామి.. ఈ పేరు టాలీవుడ్ లో ఫేమస్ అని అందరికి తెలుసు.. ఈయన సెలెబ్రిటీల జాతకాల గురించి చెబుతూ నిత్యం సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలుస్తున్నాడు.. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.. ఈయన దగ్గర హీరోయిన్స్ తమ కెరీర్ బాగుండాలని పూజలు చేయించుకుంటూ ఈయనను సెలెబ్రెటీగా మార్చేశారు..
ఇప్పటికే ఈయన దగ్గర రష్మిక మందన్న, నిధి అగర్వాల్ వంటి వారు పూజలు చేయించుకున్నారు.. ఇక పూజా హెగ్డే కూడా చేయించు కుంటున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.. అంతేకాదు ఆయన చెప్పే విషయాలు కరెక్ట్ గా జరగడంతో ఆయన మరింత ఫేమస్ అయ్యాడు.. అయితే ఈయన ఈసారి రకుల్ ప్రీత్ జాతకం చెప్పాడు.. దీంతో ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
స్టార్ హీరోయిన్ గా మొన్నటి వరకు చెలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన బ్యూటీలలో ఒకరు.. ఈమె చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మెగా హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటించిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అడపాదడపా అవకాశాలు అందుకుంటూ కెరీర్ లాగిస్తుంది.
ఇదిలా ఉండగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ అమ్మడి జాతకం బయట పెట్టేసాడు.. ఈమెకు పెళ్లి జీవితం అంతగా కలిసిరాదని చెప్పాడు. పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టాలేనని ఇప్పటికే ప్రేమలో పడ్డప్పటి నుండి ఈమె కెరీర్ ఆశాజనంకంగా లేదని ఇక పెళ్లి చేసుకుంటే సమంత లాగానే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండాలని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..