
VH : కర్ణాటక గెలుపు కాంగ్రెస్ కేడర్ లో మంచి ఊపును ఇచ్చింది. ఆ పార్టీ మరో సౌత్ స్టేట్ ను సొంతం చేసుకునేందుుకు ఉవ్విళ్లు ఊరుతోంది. ఈ ఏడాది చివరలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో పార్టీని ప్రభుత్వంలోకి తేవాలని రేవంత్ సేన పావులు కదుపుతుంది. నియోజకర్గాల్లో ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలపై కన్నేసింది. పార్టీలో చేరికలపై కూడా నేతలు దారులు తెరిచారు. చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వినిపిస్తున్న ఎన్నికల వరకు ఎవరు వస్తారో..? రారో..? తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ సినియర్ నాయకుడు వీహెచ్ హన్మంతారావు గాంధీ భవన్ లో నేడు (మే 18) మాట్లడారు. పార్టీలో చేరికలు, గెలుపుపై వ్యూహాలను చర్చించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అందులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచిన సమయంలో గతంలో తనను ముఖ్యమంత్రి చేయాలని రాజీవ్ గాంధీ అనుకున్నారని తెలిపారు. ఆయనంటే తనకు చాలా ఇష్టం మని ఆయనతో ఎక్కువ సమయం గడిపేవాడినని చెప్పుకచ్చారు. ఈ చనువు, నాలో ఉన్న టాలెంట్ చూసి సీఎంగా ఉండాలని సూచించారని కానీ నా దురదృష్టం వల్ల కాలేకపోయానని వీహెచ్ చెప్పారు.
ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఏ పార్టీకి హవా ఉంటే ఆ పార్టీకి నేతలు రావాలని ఉత్సాహ పడతారని, వారందరినీ ఆయన అధిష్టానం, రేవంత్ రెడ్డికి చెప్తానని హామీ ఇచ్చారు. కర్ణాటక గెలుపు పార్టీకి మరింత ఊపు నిచ్చింది. బీజేపీలోకి వెళ్లాలనుకునే నేతలందరూ ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ లోకే రావాలని కలలు కంటున్నారు. వీరందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తాం. కానీ పదవులపై ఎలాంటి హామీలు ఇవ్వద్దని కూడా అధిష్టానానికి చెప్తాను అన్నారు. ఇలా పదవులు ఇస్తే సీనియర్ కేడర్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.