Vick girl bikini : ఒక్క కన్నుగీటుతో కుర్రకారును తన వైపునకు తిప్పుకున్న స్టార్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. దీంతో తెరమరుగు అయ్యింది ప్రియా వారియర్. వెండితెరకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ సందడి చేస్తుంది అందాల సుందరి.
2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కు ముందే స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి వెండితెర మాత్రం ఎందుకో కలిసి రావడం లేదు. 2018లో విడుదల కావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ కోర్టు కేసుల్లో చిక్కుకొని ఆగిపోయింది. వింక్ గర్ల్ గా ఇమేజ్ ను సంపాదించుకున్న కేరళ కుట్టీ క్లాసికల్ డాన్సర్. తన చిన్నతనం నుంచి డ్యాన్స్ చేసి మెప్పించింది ఆమె. ఇక వెండితెరపై తన సత్తా చాటుకోవాలని ఆశతో వచ్చిన ఈ అమ్మడికి అక్కడ ఎదురుగాలి తగిలింది. అయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఆమెకు దాదాపు 7.1 మిలియన్ ఫాలోవర్స్ దూసుకుపోతోంది వింక్ గర్ల్.
గతంలో నితిన్ సరసన ‘చెక్’తో పలకరించింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇక అప్పటి నుంచి ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో మరింత కుంగిపోయింది ఈ కేరళ కుట్టి. గతంలో తనపై వచ్చిన ట్రోల్స్ భరించలేక ఇన్ స్టా నుంచి తప్పుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత మళ్లీ ఏమనుకుందో ఏంటో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు విచ్చలవిడిగా గ్లామర్ షోలు చేస్తూ సందడి చేస్తుంది.
చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే, ఆమె ప్రస్తుతం వెకేషన్స్ ను ఆస్వాదిస్తోంది, మాల్దీవుల ఉష్ణమండల స్వర్గానికి కొంత ఉత్తేజాన్ని జోడిస్తుంది. మాల్దీవుల్లోని అద్భుతమైన నీటిలో, ప్రియా తన అద్భుతమైన నీలి బికినీలో దివ్య జల దేవతను పోలిన తన మచ్చలేని రూపాన్ని ప్రదర్శిస్తుంది. నగలను వదులుకోవాలన్న ఆమె నిర్ణయం ఆమె సహజ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది, అభిమానులను విస్మయానికి గురిచేస్తుంది.