
Video of the Day : ఎయిర్పోర్టులో పరస్పరం ఎదురుపడిన పవన్, లోకేష్ ఆత్మీయ ఆలింగనం వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బంధం అంటే ఇది కదా అని ట్యాగ్ జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు పరస్పరం నమస్కారం చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మొదటినుంచి పవన్ విషయంలో లోకేష్ గౌరవభావం గానే మెలుగుతున్నారు.
గత ఏడాది చంద్రబాబు అరెస్ట్ సమయంలో నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి పరామర్శించారు పవన్. వెంటనే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. తానే కాదు బిజెపిని సైతం కూటమిలోకి తెస్తానని కూడా పవన్ తేల్చి చెప్పారు. అన్నట్టుగానే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా పట్టించుకోలేదు. బిజెపిని తెచ్చి కూటమి కట్టారు. ఏపీలో అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అందుకే పవన్ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ఒక రకమైన భావనతో నడుచుకుంటున్నారు.