Video viral : రైతు రుణమాఫీ విషయంలో అడ్డగోలు నిబంధనలతో ప్రభుత్వం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు రైతులు బ్యాంకులకు వెళ్లి బ్యాంకు అధికారులను విచారించారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్పల్లి గ్రామానికి చెందిన వడ్డె మల్కమ్మ, చంద్రయ్య దంపతులు బ్యాంకులో 70 వేలు అప్పు తీసుకున్నారు. లక్ష లోపు రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. కానీ ఈ దంపతులకు రుణమాఫీ జరగలేదు.
ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లి ఖాతా తనిఖీ చేయగా.. మీకు రుణమాఫీకి అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో అప్పుల బాధతో తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బ్యాంకు ఎదుట బోరున విలపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తన చిన్నకుమార్తె భారతమ్మతో కలిసి ఆటోలో ప్రజావాణికి వచ్చిన ఆ వృద్ధ దంపతులు గోడు వెల్లబోసుకున్నారు.
హన్వాడ మండలం గుండ్యాల శివారులో తన భార్య మల్కమ్మ పేరిట ఎకరంన్నర పొలం, తన పేరు మీద నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు చంద్రయ్య తెలిపారు. రూ.70వేలు పంట రుణం తీసుకున్నట్లు తెలిపారు. 30 వేలు ఒకసారి, మరో సారి రూ.40వేలు పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ కోసం బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రుణమాఫీ కాలేదని వాపోతున్నారు. కలెక్టరు, అధికారులు స్పందించి తమకు పూట గడవడం లేదని.. న్యాయం చేయాలని కోరారు.
రుణమాఫీ అవ్వదని చెప్పిన బ్యాంక్ అధికారులు.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న
మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్పల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ, వడ్డె చంద్రయ్య అనే దంపతులు రుణమాఫీ అవ్వలేదని బ్యాంక్ దగ్గరికి వెళ్లారు.. వారి ఖాతా చెక్ చేసిన అధికారులు రుణమాఫీకి అర్హులు… pic.twitter.com/gJ7OI4tT2y
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024