Vignesh and Nayantara :
సౌత్ ఇండస్ట్రీలో విఘ్నేష్-నయనతార జంటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉండి రీసెంట్ గానే పెండ్లి చేసుకున్నారు. అయితే అప్పటి నుంచే ఎన్నో వివాదాలు వారిని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరిపై ఏకంగా కేసు నమోదైంది. దాంతో వీరిద్దరికి సంబంధించిన ఈ విషయం వైరల్ అవుతోంది.
విఘ్నేష్ శివన్ తండ్రి శివ కొళుదు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్ కుడి గ్రామానికి చెందిన వ్యక్తి. వీరు తొమ్మిది మంది అన్నదమ్ములు. కావా శివ తన అన్నదమ్ములకు చెందిన ఉమ్మడి ఆస్తిని గతంలో వేరే వ్యక్తికి అమ్మేశాడు. శివ సోదరులు తమ ఆస్తిని తమకు తెలియకుండా అమ్మేశాడని ఆరోపిస్తున్నారు.
ఆస్తి కొన్న వ్యక్తికి తిరిగి డబ్బులు చెల్లించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని కోరుతూ తిరుచ్చిలోని డీజీపీ ఆఫీస్ లో విఘ్నేష్ బాబాయ్ లు మాణిక్యం, కుంచిత పాదంలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నయనతార-విఘ్నేష్ శివన్, ఆయన తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల పేర్లు కూడా చేర్చారు.
కేసు వివరాల ఆధారంగా విచారణ జరిపించాలని డీజీపీ ఆదేశించారు. దాంతో ఈ విషయం కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నయనతార, విఘ్నేష్ లు ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే వీరి నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాగా పెళ్లి అయినప్పటి నుంచే వీరిద్దరూ ఇలా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు కవల పిల్లలతో హ్యాపీగానే కలిసి బతుకుతున్నారు.