
Vijay Devarakonda
టాలీవుడ్ లో ఫ్యాన్స్ తో ముద్దుగా రౌడీ స్టార్ అని పిలిపించు కుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ.. ఈయన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగాడు.. ఈయన ఫాలోయింగ్ చాలానే అని చెప్పాలి.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మంచి విజయం అందుకున్నాడు.
ఇక అంత కంటే ముందే కొన్ని సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటించాడు.. పెళ్లి చూపులు నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈయనకు గుర్తింపు రావడమే కాకుండా మరిన్ని అవకాశాలు వచ్చాయి.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది.
ఇక ఇటీవలే వచ్చిన లైగర్ సినిమా హిట్ అయి ఉంటే ఈయన కెరీర్ మరోలా ఉండేది కానీ ఇది ప్లాప్ అయ్యింది. ఇది పక్కన పెడితే ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజును జరుపు కుంటున్నారు. 34వ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు.. ఈయన బర్త్ డే కానుకగా ఈయన గురించి చాలా మందికి తెలియని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే విజయ్ ఒక సీరియల్ లో కూడా నటించారు అంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఈయన చిన్నప్పుడే ఒక సీరియల్లో బాలనటుడిగా పరిచయం అయ్యారట.. శ్రీ సత్యసాయి బాబా జీవిత చరిత్ర సీరియల్ తీస్తున్నప్పుడు అందులో విజయ్ కూడా నటించారట.. ఈ సీరియల్ కు సంబంధించిన వీడియోను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.. దీంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.






