
Vijay Antony Daughter Suicided : సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఏదొక రూపంలో గత కొన్ని రోజులుగా విషాదాలే వింటున్నాం. తాజాగా స్టార్ హీరో కూతురు ఆత్మహత్య చేసుకుని మరణించి ఇండస్ట్రీకే పెద్ద షాక్ ఇచ్చింది. ఒక స్టార్ హీరో కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటా అని ప్రజలంతా ఆరా తీస్తున్నారు.
మరి ఆ స్టార్ హీరో ఎవరు? చనిపోయిన ఆమె వయసు ఎంత ? అనే వివరాల్లోకి వెళ్తే.. విజయ్ ఆంటోనీ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. ఈయన అంతలా తన పేరును అన్ని ఇండస్ట్రీలకు విస్తరింపజేసుకున్నారు.. మరి ఈ స్టార్ హీరో కూతురు లారా ప్రస్తుతం 12వ తరగతి చదువుతుంది.. ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందరికి షాక్ ఇస్తుంది.
12వ తరగతి చదువుతున్న లారా ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో చెన్నై లోని తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్య గురించి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి ఈమె చనిపోవడానికి కారణాలు ఏంటా అని పోలీసులు దర్యాప్తి చేస్తున్నారు.
ఈమె చదువు ఒత్తిడి తోనే చనిపోయిందా లేదంటే ఇంట్లో ఏదైనా గొడవల వల్ల చనిపోయిందా? అదీ కాకపోతే కాలేజ్ లో ఏదైనా సమస్య వల్ల చనిపోయిందా ? అనేది దర్యాప్తులో తేలనుంది.. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదంగా మారింది. ఈయన కుటుంబానికి సినీ ప్రముఖులు ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు.