
Vijay Devarakonda Khushi Trailer : టాలీవుడ్ లో ఫ్యాన్స్ తో ముద్దుగా రౌడీ స్టార్ అని పిలిపించు కుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ వంటి ప్లాప్ వచ్చిన కూడా తన క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు..
ప్రస్తుతం విజయ్ కు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. లైగర్ సినిమా హిట్ అయి ఉంటే ఈయన కెరీర్ మరోలా ఉండేది కానీ ఇది ప్లాప్ అయ్యింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి.
ఈ సినిమాపై టాలీవుడ్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ముఖ్యంగా విజయ్, సామ్ కాంబో తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరిని ఆకట్టు కుంటుంది.
సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక విజయ్ కూడా సోషల్ మీడియాలో ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చారు. 2 నిముషాల 41 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ రాబోతుందంటూ ఈయన తెలిపారు. చూడాలి ఇది ఎలా ఆకట్టు కుంటుందో..!