
Vijayasai Reddy : వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ మాట్లాడిన విశ్వసనీయత, భయం, ప్రలోభాలకు లొంగడమనే అంశాలపై విజయసాయిరెడ్డి నేరుగా తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. తాను రాజ్యసభ పదవిని వదిలేసి రాజకీయాల నుంచి బయటకు వచ్చినప్పటికీ, తనలో భయం లేదని స్పష్టంగా చెప్పారు.
ఈ పరిస్థితి చూస్తుంటే, మాజీ మిత్రుల మధ్య విభేదాలు మరింత బహిరంగంగా బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నాయకుల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా “విశ్వసనీయత ముఖ్యం” అనే మాటలకు విజయసాయిరెడ్డి ఇచ్చిన ప్రత్యుత్తరం, ఇద్దరి మధ్య విభేదాలు ఇంకా పెరిగే అవకాశాన్ని సూచిస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
వైసీపీ అధినేత జగన్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం వైసీపీ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలక నేతగా, జగన్ అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీని వీడి, తన స్వంత మార్గంలో వెళ్తున్న తరుణంలో, ఇద్దరి మధ్య మాటల మాటల యుద్ధం కొత్త దిశలో సాగుతోంది.
జగన్ నిన్న పార్టీని వీడిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ నుంచి బయటకు వెళ్లే ప్రతి వాడికి విశ్వసనీయత ఉండాలి” అని అన్న విషయం, ఆయన పార్టీని వీడి వెళ్ళిన నేతలను నమ్మకద్రోహులుగా అభివర్ణించారు. తాజాగా దీనికి విజయసాయిరెడ్డి స్పందించాడు.
విజయసాయిరెడ్డి స్పందన కూడా ఆ మేరకు ఆసక్తికరంగా ఉంది. “నాలో భయం లేదు కాబట్టే పదవిని వదిలేశాను” అని చెప్పడం ద్వారా, తాను ఎలాంటి ఒత్తిడికీ, ప్రలోభాలకూ లొంగలేదని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా, జగన్ వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా కౌంటర్ ఇస్తూ, తనను అవిశ్వసనీయుడిగా చిత్రీకరించాలనే ప్రయత్నానికి విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.






