
AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.. సంచలనం అవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిలతో విజయసాయి సమావేశమయ్యారన్న వార్త.. వైసీపీలో కలకలం రేపింది. అయితే విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా రాకున్నా… ఆయన కుమార్తె మాత్రం బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీతో ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.